తాజ్‌మహల్‌ను పెళ్లి విందులకు అద్దెకివ్వాలా?

Thu,December 20, 2018 04:37 PM

చారిత్రిక కట్టడాలను పెండ్లి విందులకు, ప్రైవేటు పార్టీలకు అద్దెకిచ్చి కోట్లు సంపాదించడమా? లేక వాటి మానాన వాటిని వదిలివేయడమా? అనే విషయమై ప్రభుత్వంలో తర్జనభర్జన జరుగుతున్నది. ఆదాయం కోసం తాజ్‌మహల్, ఎర్రకోట వంటివి అద్దెకివ్వాలన్న సిఫారసును అమలు చేయకపోవడం పట్ల ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రసిద్ధ చారిత్రిక కట్టడాలను కిరాయికి ఇవ్వడంపై ప్రభుత్వం మనసుపెట్టి ఆలోచించలేదని అక్షింతలు వేసింది. అద్దెకివ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ కట్టడాల బాగోగులకు వినియోగించుకోవచ్చని మరోసారి గుర్తుచేసింది.

1997లో యానీ సంగీత కచేరీ తాజ్ నేపథ్యంగా సాగడాన్ని ఉదాహరించింది. ఈ దిశగానైనా ఆలోచనలు చేయాలని, కనీసం నేపథ్యంగా కార్యక్రమాల నిర్వహణకు అనుమతించాలని సూచించింది. చారిత్రిక కట్టడాలు, వస్తువుల పరిరక్షణ అనే శీర్షికతో పీఏసీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు సమర్పించింది. చారిత్రిక కట్టడాల శ్రేయస్సు దృష్ట్యా దీనిని అమలు చేయడం కుదరకపోవచ్చని ప్రభుత్వం తెలిపింది. పెద్దసంఖ్యలో జనం రావడం వల్ల కట్టడాల భద్రతకు ముప్పు ఏర్పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేసింది. పైగా ఇందుకు అవసరమైన సిబ్బంది ప్రస్తుతం లేరని వివరించింది.

1766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles