118 ఏళ్ల పంజాబీ బామ్మ‌కు పేస్‌మేక‌ర్

Thu,March 7, 2019 10:09 AM

హైద‌రాబాద్‌: పంజాబ్‌లో డాక్ట‌ర్లు అరుదైన శ‌స్త్ర‌చికిత్స చేశారు. 118 ఏళ్ల బామ్మ క‌ర్తార్ కౌర్ సంఘాకు పేస్‌మేక‌ర్‌ను ఇంప్లాంట్ చేశారు. లుథియానాలోని హాస్ప‌ట‌ల్‌లో విజ‌య‌వంతంగా ఈ చికిత్స జ‌రిగింది. ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. పేస్‌మేక‌ర్‌ను అమ‌ర్చిన డాక్ట‌ర్ ర‌వీంద‌ర్ సింగ్ కూడా ఈ ఆప‌రేష‌న్‌పై స్పందించారు. బామ్మ‌కు ఆ వ‌య‌సులో ఆప‌రేష‌న్ చేయ‌డం పెద్ద చాలెంజ్ అన్నారు. ఆమె ఇప్పుడు బాగానే ఉంద‌న్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు.

2917
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles