నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

Mon,June 17, 2019 08:40 AM

న్యూఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌తో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొంటారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నూతన ఎంపీలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.


ఇవాళ, రేపు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ముందుగా ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత కేబినేట్ మంత్రులు, ప్యానెల్ చైర్మన్లు ప్రమాణం చేస్తారు. అనంతరం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ప్రకారం రాష్ర్టాల వారీగా ఎంపీలు ప్రమాణం చేస్తారు. ముందుగా అండమాన్ నికోబార్ ఎంపీ ప్రమాణ స్వీకారం చేస్తారు. రెండో స్థానంలో రాష్ట్ర ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. నియోజకవర్గ క్రమసంఖ్య ఆధారంగా ప్రమాణం ఉంటుంది. ఏపీ నుంచి ముందుగా అరకు ఎంపీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 21 నుంచి ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది.

606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles