పేటీఎం 12/12 ఫెస్టివల్

Tue,December 12, 2017 06:28 AM

న్యూఢిల్లీ : డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగం గా పేటీఎం.. ఈరోజు తమ 12/12 ఫెస్టివల్ రెండో ఎడిషన్‌ను నిర్వహిస్తున్నది. సంప్రదాయ వ్యాపా ర భాగస్వాముల పేటీఎం వినియోగం పెరిగితే.. మరింతగా అమ్మకాలు నమోదవుతాయంటున్నది ఈ భారతీయ ఎలక్ట్రానిక్ పేమెంట్-ఈ కామర్స్ బ్రాండ్. ఆ లక్ష్య సాధనకే ఈఆఫ్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ అని ఓ ప్రకటనలో పేటీఎం సోమవారం స్పష్టం చేసింది.


ఈ ఫెస్టివల్‌లో భాగంగా చెల్లింపులపై 50 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారులు పొందగలరని తెలిపింది. మరెన్నో ప్రయోజనాలనూ అందుకోవచ్చన్నది. పేటీఎంకు 50 లక్షల ఆఫ్‌లైన్ వ్యాపార కస్టమర్లుండగా, ఇందులో సూపర్‌మార్కెట్లు, రెస్టారెంట్లు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు, పాల బూత్‌లు తదితర వ్యాపారులున్నారు. పేటీఎం చెల్లింపులను అంగీకరించి కొనుగోళ్లను పెంచుకోవాలని, తద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా సంస్థ సీవోవో కిరణ్ వాసిరెడ్డి పిలుపునిచ్చారు.

1770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles