మోదీని గెలిపించినవారిపైనే దాడులు..

Tue,October 9, 2018 10:26 AM

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీని గెలిపించిన వారణాసి నియోజకవర్గ ప్రజలను గుజరాత్‌లో టార్గెట్ చేస్తున్నారని బీఎస్పీ నేత మాయావతి ఆరోపించారు. యూపీ, బీహారీ ప్రజలపై దాడులకు పాల్పడుతున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని మాయావతి డిమాండ్ చేశారు. గుజరాత్‌లో ఠాకూర్లు దాడులు, విధ్వంసాలకు పాల్పడటంతో వారం రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్‌లకు చెందిన 20వేల మంది కి పైగా గుజరాతేతరులు సొంత స్థలాలకు వెళ్లిపోయారని ఉత్తర్ భారతీయ వికాస్ పరిషత్ ప్రకటించింది. కాగా, ప్రజలు సంయమ నం పాటించాలని, హింసకు పాల్పడవద్దని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సోమవారం కోరారు. ఒక వ్యక్తి చేసిన తప్పుకు మొత్తం వలస కార్మికులను అపరాధులుగా చూడరాదని అభ్యర్థించారు. గత 48 గంటల్లో ఒక్క అవాంఛనీయ ఘటన కూడా జరుగలేదని సీఎం రూపానీ తెలిపారు.

1737
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles