స్మార్ట్‌ఫోన్ వాడకంపై ఆనంద్ మహీంద్ర ట్వీట్ అదిరిపోయింది..!

Thu,April 18, 2019 12:25 PM

photo shared by anand mahindra goes viral on social media

సెల్‌ఫోన్.. ఇదే కదా ఇప్పుడు మనకు శత్రువు. ఈ లోకంలో మనకు మనుషులు శత్రువులని అనుకుంటాం కానీ అస్సలే కాదు. మనుషులు మ‌నుషుల‌కు ఎప్పుడూ శత్రువులు కాదు. మనకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది సెల్‌ఫోనే. అదే కదా మనల్ని నాశనం చేసేది. మామూలు సెల్‌ఫోన్‌ను ఇప్పుడు ఎవరు వాడుతున్నారు.. అందరూ స్మార్ట్‌ఫోన్లే కదా. యూత్ మాత్రమే కాదు.. స్కూల్‌కు వెళ్లే పిల్లలు కూడా స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. అసలైన ప్రపంచాన్ని వదిలి ఊహా ప్రపంచంలోనే బతకడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అన్నీ తెలిసీ ఏం చేయలేని పరిస్థితి అందరిదీ.

అయితే.. మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వాట్సప్‌వండర్‌బాక్స్ హాష్‌టాగ్‌తో షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన దాన్ని జనవరిలో పోస్ట్ చేసినప్పటికీ.. ఆ ఫోటో మాత్రం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. సెల్‌ఫోన్‌కు ఏ కవర్ ఉంటే బాగుంటుంది అనే దానిపై షేర్ చేసిన పోస్ట్ అది. మీరు పైన చూస్తున్నారుగా ఫోటో అదే. చెప్పులను పోలి ఉన్న కవర్లు అయితే సెల్‌ఫోన్లకు కరెక్ట్‌గా సెట్ అవుతాయట. స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కువ సేపు ఉపయోగిస్తే మనకు మనం ఆ చెప్పులతో కొట్టుకున్నట్టేనట. ఇదేదో బాగుంది కదా.


3174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles