పీఎం ముఖ్యసలహాదారుగా ప్రమోద్ కుమార్ సిన్హా

Wed,September 11, 2019 07:20 PM

PK Sinha appointed principal advisor to PM narendramodi


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య సలహాదారుగా మాజీ కేబినెట్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ సిన్హా నియమితులయ్యారు. ప్రమోద్ కుమార్ సిన్హా గత నెలలో పీఎంవోలో ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా నియామకమయ్యారు. ప్రస్తుతం ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్న పీకే సిన్హాను సెప్టెంబర్ 11 (బుధవారం)నుంచి పీఎం ముఖ్యసలహాదారుగా కొనసాగించేందుకు సంబంధించిన ప్రతిపాదనలను అపాయింట్ మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఏసీసీ) ఆమోదించింది. ఈ మేరకు పీఎంవో కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. పీకే సిన్హా 1977 బ్యాచ్ ఐఏఎస్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన అధికారి.

881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles