నేనూ కాపలాదారుడినే.. వీడియో రిలీజ్ చేసిన మోదీ

Sat,March 16, 2019 01:28 PM

PM Modi Comes Up With Main Bhi Chowkidar Campaign

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని సోషల్‌మీడియాలో వినూత్నంగా ప్రారంభించారు. ప్రధాని మోదీని.. చౌకీ దార్ చోర్ హై(కాపలా దారుడే దొంగ) అంటూ విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దానికి కౌంటర్‌గా మోదీ ఇవాళ మై బీ చౌకీదార్(నేనూ కాపలాదారుడినే) అనే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. సామాజిక దుష్టశక్తులు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి వాచ్‌మన్ లేదా కాపాలదారుడని మోదీ వివరించారు. తనను తాను కాపలాదారుడిగా అభివర్ణించుకున్న మోదీ ట్విటర్‌లో స్పందించారు. మీ కాపలాదారుడు నిబద్ధతతో నిలబడ్డాడు. దేశానికి సేవచేస్తున్నాడు. నేను ఒంటరిని కాదు. భారత్ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చౌకీదార్‌లే. ఇవాళ ప్రతి భారతీయుడు మై బీ చౌకీదార్ అని చెప్తున్నారని మోదీ ట్వీట్ చేశారు.







1163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles