HomeLATEST NEWSPM Modi meets the family of late former Union Minister Arun Jaitley at his residence

జైట్లీ కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాని మోదీ

Published: Tue,August 27, 2019 12:03 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం పరామర్శించారు. జి-7 సదస్సు ముగించుకుని నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ.. ఇవాళ ఉదయం జైట్లీ నివాసానికి వెళ్లారు. అక్కడ మోదీకి అమిత్ షా ఆహ్వానం పలికారు. అనంతరం జైట్లీ చిత్రపటానికి పూలమాల వేసి మోదీ, అమిత్ షా నివాళులర్పించారు. జైట్లీ కుటుంబ సభ్యులకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. జైట్లీ మృతి వార్త తెలుసుకున్న మోదీ.. విదేశీ పర్యటన మధ్యలోనే భారత్‌కు రావడానికి సిద్ధమయ్యారు. కానీ జైట్లీ కుటుంబ సభ్యుల సూచనతో మోదీ విదేశీ పర్యటన కొనసాగించారు.




708
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology