గోపూజ చేసిన మోదీ.. వీడియో

Wed,September 11, 2019 12:52 PM

PM Modi unveils Swachhta Hi Seva Programme in Mathura

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఎంపీ హేమామాలినికి చెందిన‌ మ‌థుర నియోజ‌క‌వ‌ర్గంలో ఇవాళ ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టిస్తున్నారు. అక్కడ ఆయ‌న స్వ‌చ్ హీ సేవా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. నేష‌న‌ల్ ఆర్టిఫిషియ‌ల్ ఇన్‌సెమినేష‌న్ ప్రోగ్రామ్‌ను ఆవిష్క‌రించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తామ‌ని ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇవాళ కొంద‌రు మ‌హిళా పారిశుద్ధ కార్మికుల‌తో గ‌డిపారు. ప్లాస్టిక్ చెత్త‌ను సేక‌రించే మ‌హిళ‌ల‌తో మోదీ ముచ్చ‌టించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న ప్ర‌చారాన్ని మొదలుపెట్టారు. అంత‌క‌ముందు మోదీ కాసేపు ఓ ఆవు, దూడ‌తో గ‌డిపారు. ఆ జంతువుల‌ను నెమురుతూ క‌నిపించారు. ఆవుకు బొట్టుపెట్టి దాని మెడ‌లో దండ‌వేశారు. ఆ త‌ర్వాత ఆవుకు వ‌స్త్రాన్ని స‌మ‌ర్పించారు.



651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles