మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్‌.. బియ‌ర్ గ్రిల్స్‌తో మోదీ అడ్వంచ‌ర్‌

Mon,July 29, 2019 03:30 PM

PM Narendra Modi goes on a safari, rows a boat on Man Vs Wild with Bear Grylls

హైద‌రాబాద్‌: డిస్క‌వ‌రీ ఛాన‌ల్‌లో వ‌చ్చే ఫేమ‌స్ అడ్వంచ‌ర్‌ ప్రోగ్రామ్ మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్‌లో ప్ర‌ధాని మోదీ క‌నిపించ‌నున్నారు. ఆ షో హోస్ట్ ఎడ్వ‌ర్డ్ మైఖేల్ గ్రిల్స్ అలియాస్ బియ‌ర్ గ్రిల్స్‌.. ప్ర‌ధాని మోదీని ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆగ‌స్టు 12వ తేదీన డిస్క‌వ‌రీ ఛాన‌ల్ లో ప్ర‌సారం చేయ‌నున్నారు. ఆ షోకు సంబంధించిన ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. బియ‌ర్ గ్రిల్స్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఆ ట్రైల‌ర్ వీడియోను పోస్ట్ చేశాడు. అడ‌వుల్లో గ్రిల్స్‌తో క‌లిసి మోదీ టూర్ చేశాడు. జంతువుల‌ సంర‌క్ష‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ మార్పుల అంశంపై మోదీతో గ్రిల్స్ చ‌ర్చించ‌నున్నాడు. ఆగ‌స్టు 12వ తేదీన రాత్రి 9 గంట‌ల‌కు ఆ కార్య‌క్ర‌మం ప్రసారం కానున్న‌ది. ఈ దేశానికి అత్యంత ముఖ్య‌మైన వ్య‌క్తి మీరు, మిమ్ముల్ని స‌జీవంగా ఉంచ‌డ‌మే నా క‌ర్త‌వ్యం అంటూ గ్రిల్స్ ఆ వీడియోలో కామెంట్ చేశాడు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో బియ‌ర్ గ్రిల్స్ ఇండియాకు వ‌చ్చాడు. అప్పుడు ఉత్త‌రాఖండ్‌లో ఉన్న జిమ్ కార్బెట్ టైగ‌ర్ ఫారెస్ట్‌లో షో చేశాడు.
1465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles