ఫిట్‌గా ఉంటే.. విజ‌యం మీదే: ప‌్ర‌ధాని మోదీ

Thu,August 29, 2019 03:02 PM

PM Narendra Modi launched Fit India Movement

హైద‌రాబాద్‌: ఫిట్ ఇండియా ఉద్య‌మాన్ని ఇవాళ ప్ర‌ధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. శారీర‌క క‌స‌ర‌త్తులు అల‌వాటు చేసుకునే విధంగా ప్ర‌తి రోజూ కార్య‌క్ర‌మాలుండాల‌న్నారు. ప్ర‌తి ఒక‌రు త‌మ‌ జీవితాల్లో ఆట‌కు స్థానం క‌ల్పించాల‌న్నారు. స‌క్సెస్‌, ఫిట్‌నెస్ మ‌ధ్య సంబంధం ఉంద‌ని మోదీ అన్నారు. ఏ రంగాన్ని తీసుకున్నా.. వాళ్ల జీవితాల‌ను మీరు ప‌రిశీలించండి.. క్రీడ‌లైనా, సినిమాలైనా, బిజినెస్ అయినా, వాళ్లు శారీర‌కంగా దృఢంగా ఉంటార‌ని అన్నారు. మీకు న‌చ్చిన వారి లైఫ్‌స్ట‌యిల్‌ను మీరు ప‌రిశీలిస్తే ఇది మీకు అర్థ‌మ‌వుతుంద‌న్నారు. విజ‌య‌వంత‌మైన వ్య‌క్తుల వెనుక ఫిట్‌నెస్ ఒక‌టే కామ‌న్‌గా ఉంటుంద‌న్నారు. మీరు ఏ ప్రొఫెషెన్‌లో ఉన్నా.. దాంట్లో మీరు ఉత్త‌మంగా రాణించాల‌ని, దానికి మాన‌సిక‌, శారీర‌క ఫిట్‌నెస్ అవ‌స‌రం అన్నారు. ఫిట్ ఉంటేనే ఆకాశాన్ని అందుకోగ‌ల‌ర‌న్నారు. శారీర‌కంగా దృఢంగా ఉండాల‌ని మీరు అనుకుంటే, అప్పుడు మీ శ‌రీరం మీకు అర్థ‌మ‌వుతుంద‌న్నారు. మ‌న శరీరం గురించి, మ‌న బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల గురించి మ‌న‌కు త‌క్కువ‌గా తెలుస‌న్నారు. ఫిట్‌నెస్ ఉద్య‌మంలో పెట్టుబ‌డి సున్నా అన్నారు. కానీ దాని ప్ర‌తిఫ‌లం మాత్రం భారీగా ఉంటుంద‌న్నారు. స‌క్సెస్‌కు ఎలివేట‌ర్ ఏమీ ఉండ‌ద‌ని, మెట్లు ఎక్కాల్సిందే అని మోదీ అన్నారు. డ‌యాబెటిస్‌, హైప‌ర్‌టెన్ష‌న్ లాంటి లైఫ్ స్ట‌యిల్ వ్యాధులు ఇండియాలో పెరుగుతున్నాయ‌ని, అయితే లైఫ్ స్ట‌యిల్‌లో మార్పులు చేస్తే ఆ స‌మ‌స్య‌లు తీరుతాయ‌న్నారు. టెక్నాల‌జీ వ‌ల్ల మ‌నుషులు న‌డ‌క కూడా త‌గ్గించార‌ని, దాని వ‌ల్ల లైఫ్ స్ట‌యిల్ వ్యాధులు వ‌స్తున్న‌ట్లు చెప్పారు. అందుకే మ‌ళ్లీ న‌డ‌క‌ను పెంచాల‌న్నారు.573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles