100 రోజుల్లో ట్రైల‌రే చూశారు.. సినిమా ముందుంది

Thu,September 12, 2019 04:17 PM

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ జార్ఖండ్‌లో ప‌ర్య‌టించారు. రాంచీలో ఆయ‌న కొన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలను ప్రారంభించారు. దేశ పేద ప్ర‌జ‌ల సంక్షేమ ప‌థ‌కాల కోసం జార్ఖండ్ లాంచింగ్ ప్యాడ్‌గా మారింద‌న్నారు. గ‌త 100 రోజుల ప్ర‌భుత్వంలో కేవ‌లం ట్రైల‌ర్‌ను మాత్ర‌మే చూశార‌ని, ఇంకా సినిమా మొత్తం ముందు ఉంద‌ని మోదీ అన్నారు. పేద ప్ర‌జ‌ల సొమ్మును దోచుకున్న‌వారిని స‌రైన చోటుకు పంపేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఇప్ప‌టికే కొంద‌రు అక్క‌డికి వెళ్లార‌న్నారు. దేశం క‌న్నా గొప్ప‌వాళ్ల‌మ‌ని అనుకున్న‌వారు ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నార‌ని, గ‌తంలో ఎన్న‌డూ చూడ‌న‌టువంటి వేగంతో దేశం ముందుకు వెళ్తోంద‌న్నారు. అంత‌కుముందు ఆయ‌న షాహిబ్‌గంజ్‌లో నిర్మించిన మ‌ల్టీమోడ‌ల్ వాట‌ర్‌వేస్‌ను దేశానికి అంకితం చేశారు. కొత్త నిర్మించిన రాష్ట్ర అసెంబ్లీని ప్రారంభించారు. కొత్త సెక్ర‌టేరియేట్ బిల్డింగ్ కోసం ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. స్వ‌యం ఉపాధి వారి కోసం జాతీయ పెన్ష‌న్ స్కీమ్‌ను ప్రారంభించారు. వార్షిక ఆదాయం 1.5 కోట్లు త‌క్కువ‌గా ఉన్న‌వారికి ఇది వ‌ర్తిస్తుంది. 18 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న‌వారు పెన్ష‌న్ స్కీమ్‌కు అర్హులు. అయితే 60 ఏళ్లు వ‌చ్చిన త‌ర్వాత వారికి నెల‌కు 3వేలు ఇస్తారు. జాతీయ పెన్ష‌న్ స్కీమ్ వ‌ల్ల సుమారు 3.50 ల‌క్ష‌ల స‌ర్వీస్ సెంట‌ర్ల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌ని మోదీ అన్నారు.

3215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles