ప్ర‌ధాని మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే..!

Mon,May 27, 2019 11:33 AM

PM Narendra Modi likely to visit Maldives on 7-8 June

న్యూఢిల్లీ: భారత ప్ర‌ధాన మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత న‌రేంద్ర‌మోదీ ద‌క్షిణాసియా దేశం మాల్దీవుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. జూన్ 7-8వ తేదీల్లో ఈ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. వ‌రుస‌గా రెండోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత మోదీ తొలి విదేశీ ప‌ర్య‌ట‌న ఇదే కావ‌డం విశేషం. జూన్ మొద‌టివారంలో భార‌త ప్ర‌ధాని మాల్దీవుల రాజ‌ధాని మాలే రానున్నార‌ని ఆదేశ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. దీనిపై ఆదేశ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు.

ద్వైపాక్షిక సంబంధాల బ‌లోపేతం చేసుకోవ‌డం ల‌క్ష్యంగా ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని భార‌త విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. 2014లో తొలిసారి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన అనంత‌రం స‌రిహ‌ద్దు దేశం భూటాన్ వెళ్లిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ఈనెల 30వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

4025
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles