రాహుల్ నియోజకవర్గంలో మోదీ ప‌ర్య‌ట‌న‌..!

Tue,February 19, 2019 05:41 PM

PM Narendra Modi to visit Amethi on February 27

అమేథి(ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌): ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ త్వ‌ర‌లో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అమేథిలో ప‌ర్య‌టించ‌నున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 27న న‌రేంద్ర‌మోదీ అమేథిలో నిర్వ‌హించే బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొంటార‌ని బీజేపీ నేత ఒక‌రు మంగ‌ళ‌వారం తెలిపారు. మున్షిగంజ్‌లో గ‌ల ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీని మోదీ సంద‌ర్శిస్తార‌ని.. ఆ త‌ర్వాత బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగిస్తార‌ని అమేథి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం బీజేపీ క‌న్వీన‌ర్ రాజేశ్ అగ్ర‌హారి తెలిపారు. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌డంతో పాటు వివిధ‌ ప్రాజెక్టుల‌ను ప్రారంభిస్తార‌ని ఆయ‌న పేర్కొన్నారు. 2014(లోక్‌స‌భ‌)లో అమేథిలో రాహుల్ గాంధీ ప్రత్యర్థిగా లక్ష ఓట్ల తేడాతో బీజేపీ నేత‌ స్మృతి ఇరానీ పరాజయం పాలైంది.

1044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles