సీతాకోకచిలుకల్ని ఎగరేసిన ప్రధాని మోదీ..వీడియో

Tue,September 17, 2019 02:39 PM


గుజరాత్: భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు 69వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ నేడు గుజరాత్‌లోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మోదీ నర్మదా జిల్లా కేవడియాలోని బట్టర్ ఫ్లై గార్డెన్ (సీతాకోకచిలుకలు) సందర్శించి..సీతాకోకచిలుకలను గాల్లోకి ఎగరేశారు. అదేవిధంగా కాక్టస్ గార్డెన్‌కు వెళ్లారు. ఖాల్వని ఎక్ టూరిజం స్థలాన్ని సందర్శించారు. అనంతరం సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాంతాన్ని సందర్శించారు. డ్యామ్‌పై పూజలు చేశారు.


మోదీ నర్మదా పరివాహక ప్రాంతంలో ఏక్తా నర్సరీని సందర్శించి..అక్కడ ఉత్పత్తి చేసే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ వెంట గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, గవర్నర్ ఆచార్య దేవ్ రాత్ ఉన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మోదీ గురుదేశ్వర్ దత్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.












1497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles