ఉదయం 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

Sat,September 7, 2019 06:34 AM

PM Narendra Modi will address the nation from ISRO

కర్ణాటక: ఈ ఉదయం 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రధాని ప్రసంగించనున్నారు. చంద్రుడికి అతిసమీపంలోకి వెళ్లిన ల్యాండర్ నుంచి సంకేతాల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు సవ్యంగా సాగిన ల్యాండర్ ప్రయాణం.. అక్కడి నుంచి సంకేతాలు ఆగిపోయాయి. డేటాను విశ్లేషిస్తున్నట్లుగా ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ధైర్యం చెప్పారు. జీవితంలో ప్రతి ప్రక్రియలో జయాపజయాలు సాధారణం. మీరు సాధించింది తక్కువేమీ కాదు. భవిష్యత్‌పై ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుదాం. దేశం మొత్తం మీ వెంటే ఉంటుంది. ఒత్తిడిలో మరింత వివేకంతో పనిచేయాలని శాస్త్రవేత్తలకు ప్రధాని సూచించారు. భారత్‌ను సగౌరవంగా నిలిపేందుకు శాస్త్రవేత్తలు శాయశక్తులా కృషి చేశారన్నారు. ఇలాంటి క్షణాల్లో అందరూ ధైర్యంగా ఉండాలన్నారు.

744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles