మహారాష్ట్రలో 2014 ఫలితాలే పునరావృతం!

Sun,May 19, 2019 08:25 PM

Poll Of Polls Predicts Win For BJP Shiv Sena In Maharashtra

హైదరాబాద్ : మహారాష్ట్రలో 2014 సాధారణ ఎన్నికల ఫలితాలే పునరావృతం కానున్నాయా? అంటే అవుననే చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు. 2014 సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ - శివసేన కూటమి 48 స్థానాలకు గానూ 43 స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో బీజేపీ-శివసేన విజయం సాధించొచ్చు అని పలు సర్వేలు అంచనాలు వేస్తున్నాయి. ఇండియా టుడే సర్వే ప్రకారం.. బీజేపీ - శివసేన 38 నుంచి 42, కాంగ్రెస్-ఎన్సీపీ 6 నుంచి 10 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అజ్‌తక్ -యాక్సిక్ మై ఇండియా సర్వే ప్రకారం బీజేపీ 38-42, కాంగ్రెస్ 6-10, రిపబ్లిక్ - సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీ - శివసేన కలిసి 34, కాంగ్రెస్ - ఎన్సీపీ 14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏబీపీ న్యూస్ - నీల్సన్, ఇండియా టీవీ - సీఎన్‌ఎక్స్ సర్వేలు కూడా బీజేపీకే అత్యధిక స్థానాలు వస్తాయని అంచనాలు వేస్తున్నాయి.

2065
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles