కుమారుడి అంత్య‌క్రియ‌ల్లో.. పాట పాడిన త‌ల్లి- వీడియో

Tue,November 5, 2019 08:58 AM

హైద‌రాబాద్‌: ఓ క‌న్న‌త‌ల్లి త‌న కొడుకుకు ఇష్ట‌మైన పాట‌తో క‌డ‌సారి వీడ్కోలు ప‌లికింది. చ‌త్తీస్‌ఘ‌డ్‌కు చెందిన సూర‌జ్ తివారి చిన్న‌పాటి జానప‌ద గాయ‌కుడు. అత‌ని త‌ల్లి పూన‌ర్ విరాట్ కూడా ఓ సింగ‌రే. అయితే కొన్ని రోజులుగా సూర‌జ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. ఈమ‌ధ్యే హాస్ప‌ట‌ల్లో ట్రీట్‌మెంట్ తీసుకున్న అత‌ను.. ఓ స్టేజ్ షోలో ప‌ర్ఫార్మ్ చేశాడు. ఆ త‌ర్వాత గుండెపోటు రావ‌డంతో అత‌ను మృతిచెందాడు. సూర‌జ్‌కు చోలా మాటి కే రామ్‌.. ఏక‌ర్ కా భ‌రోసా.. అత్యంత ఇష్ట‌మైన పాట. ఈ పాట చ‌త్తీస్‌ఘ‌డ్‌లో చాలా ఫేమ‌స్‌. సూర‌జ్ అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలో అత‌ని త‌ల్లి ఆ పాట‌ను పాడారు. కుమారుడికి ఇష్ట‌మైన పాట‌తో ఆమె నివాళి అర్పించింది. భావోద్వేగ స్వ‌రంతో చోలా మాటి పాట‌ను ఆల‌పించారు. సూర‌జ్ స్నేహితులు అత‌డి పార్ధీవ‌దేహం ముందే ఆ పాట‌కు డ‌ప్పు కూడా వాయించారు.


5894
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles