పిల్లలతో మోదీ కరచాలనం.. వీడియో

Thu,August 15, 2019 01:20 PM

Prime Minister Narendra Modi meets children at Red Fort in Delhi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటి మాదిరిగానే తన ప్రసంగం ముగిసిన తర్వాత పిల్లల మధ్యలోకి వెళ్లారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన మోదీ.. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన ఎప్పటి మాదిరిగానే పిల్లల మధ్యలోకి వెళ్లి కరచాలనం ఇస్తూ మోదీ ఉత్సాహంగా గడిపారు. మోదీకి షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు పిల్లలు ఎగబడ్డారు. ముందు వరుసలో కూర్చొన్న పిల్లలతో మోదీ ముచ్చటిస్తున్న సమయంలో వెనుక వరుసల్లో ఉన్న విద్యార్థులు కూడా మోదీ వద్దకు వచ్చి కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. మోదీ చిరునవ్వు చిందిస్తూ పిల్లలను ఆప్యాయంగా పలుకరించి కరచాలనం చేశారు. ఇక ఎర్రకోట నుంచి వరుసగా ఆరేండ్లలో ఆరుసార్లు ప్రసంగించిన బీజేపీ ప్రధానుల్లో మోదీ రెండో వ్యక్తిగా నిలిచాడు. ఇప్పటి వరకు కేవలం అటల్ బీహారీ వాజపేయి మాత్రమే ఎర్రకోట నుంచి వరుసగా ఆరుసార్లు(1998-2003) ప్రసంగించారు.697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles