రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి ప్రధాని మోదీ, ప్రముఖుల నివాళి

Wed,October 2, 2019 09:52 AM

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, బీజేపీ సీనియర్ నేత అద్వానీ తదితరులు నివాళులర్పించారు. జాతిపిత సేవలు, ఆశయాలను దేశ ప్రజలందరూ స్మరించుకుంటున్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్‌ఘాట్‌లోనూ మోదీతో పాటు పలువురు నేతలు నివాళులర్పించారు. లాల్‌బహదూర్ శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి, సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితరులు నివాళి అర్పించారు. ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కేటీఆర్ ఘన నివాళులర్పించారు.
632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles