భారత్‌పట్ల ప్రపంచ దేశాల దృక్పథం మారింది: మోదీ

Sat,September 28, 2019 09:05 PM

ఢిల్లీ: భారత్‌దేశం పట్ల ప్రపంచ దేశాల దృక్పథం మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని ఢిల్లీకి చేరుకున్నారు. పాలెం విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటనకు విశిష్టత ఉందన్నారు. 2014లో మొదటిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎన్ వెళ్లా. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వెళ్లా. ఈ ఐదేళ్లలో చాలా పెద్ద మార్పును గమనించా. భారత్ పట్ల గౌరవం, భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథం మారిందన్నారు. హౌడీ-మోడీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అన్నారు. ఈ కార్యక్రమం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసిందన్నారు.

574
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles