షీలా దీక్షిత్‌ మృతిపై సంతాపం తెలిపిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, సీఎం కేసీఆర్‌

Sat,July 20, 2019 04:49 PM

Prime Minister Narendra Modi said he was deeply saddened by the Dikshit's demise.

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు షీలా దీక్షిత్ మృతిప‌ట్ల రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ,ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు, ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు తమ‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, ఓమ‌ర్ అబ్దుల్లా, కాంగ్రెస్ పార్టీ త‌దిత‌రులు సంతాపం తెలిపారు. ఢిల్లీ అభివృద్ధిలో షీలా దీక్షిత్‌ విశేష కృషి చేశారని ప్రధాని మోదీ అన్నారు. షీలా దీక్షిత్‌ మృతి ఢిల్లీకి తీరని లోటని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఢిల్లీకి సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆమె పేరుపొందారు. 'కాంగ్రెస్ పార్టీ ప్రియమైన నేత షీలా దీక్షిత్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబానికి నా ప్ర‌గాఢ సంతాపం తెలుపుతున్నా' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.


674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles