సాయంత్రం 4 గంట‌ల‌కు రేడియోలో మోదీ ప్ర‌సంగం

Thu,August 8, 2019 11:42 AM

Prime Minister Narendra Modi to address nation by All India Radio at 4 pm today

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని మోదీ ఇవాళ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఆల్ ఇండియా రేడియో ద్వారా ఆయ‌న ప్ర‌సంగిస్తారు. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అంశంపై ప్ర‌ధాని దేశానికి వివ‌రించ‌నున్నారు. క‌శ్మీర్‌ను రెండు యూటీలుగా ఎందుకు విభ‌జించార‌న్న అంశాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రోవైపు ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటీష‌న్‌ను ఇవాళ సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. మోదీ ప్ర‌సంగానికి సంబంధించి ఇవాళ ఉద‌యం ఆల్ ఇండియా రేడియో ఓ ట్వీట్ చేసింది. అయితే ప్ర‌స్తుతం ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.

938
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles