దేశ భక్తిని బలోపేతం చేయాలి : ప్రధాని మోదీ

Sat,November 9, 2019 01:23 PM

న్యూఢిల్లీ : అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయోధ్య కేసు విషయంలో సుప్రీం వెల్లడించిన తుది తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ తీర్పుపై మోదీ ట్వీట్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఒకరి గెలుపు, మరొకరి ఓటమిగా చూడకూడదు. రామభక్తి, రహీం భక్తి కాదు.. భారత భక్తిభావాన్ని బలోపేతం చేయాల్సిన సమయమిది. దేశ ప్రజలందరూ శాంతి, సద్భావన, ఐకమత్యంతో నిలవాలని విజ్ఞప్తి. ఒక వివాదాస్పదమైన ప్రక్రియను పూర్తి చేయడానికి న్యాయ ప్రక్రియ చాలా అవసరమని ఈ కేసు తీర్పుతో వెల్లడైంది. ఇరు వర్గాల వాదనలు వినేందుకు కోర్టు చాలినంత సమయాన్ని, అవకాశాన్ని ఇచ్చింది. దశాబ్దాలుగా కొనసాగుతన్న వివాదాన్ని కోర్టు స్నేహపూర్వకంగా పరిష్కరించింది అని మోదీ ట్వీట్‌ చేశారు.1617
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles