HomeLATEST NEWSPrime Minister Narendra Modi will be addressing the nation at 8 PM today

రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం

Published: Thu,August 8, 2019 03:13 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైద‌రాబాద్‌: ప్ర‌ధాని మోదీ ఇవాళ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు బదులుగా రాత్రి 8 గంటలకు మోదీ ప్ర‌సంగిస్తారు. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అంశంపై ప్ర‌ధాని దేశానికి వివ‌రించ‌నున్నారు. క‌శ్మీర్‌ను రెండు యూటీలుగా ఎందుకు విభ‌జించార‌న్న అంశాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రోవైపు ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటీష‌న్‌ను ఇవాళ సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. మోదీ ప్ర‌సంగానికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు మోదీ ప్రసంగిస్తారని ఇవాళ ఉద‌యం ఆల్ ఇండియా రేడియో ఓ ట్వీట్ చేసింది. అయితే ప్ర‌స్తుతం ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. మోదీ ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసంగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ టెలివిజన్ మాధ్యమం ద్వారా మోదీ ప్రసంగించనున్నారు.


2285
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology