భారత వైమానిక దళానికి ప్రధాని శుభాకాంక్షలు

Tue,October 8, 2019 12:30 PM

న్యూఢిల్లీ: నేడు భారత వైమానిక దళం 87వ వార్షిక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వైమానిక దళ బృందాలకు ట్విట్టర్‌ ద్వారా హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. ట్టిట్టర్‌ ద్వారా ప్రధాని ప్రస్తావిస్తూ.. వైమానిక యోధులకు, వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు. దేశం కోసం అహర్నిషలు కష్టపడి పని చేస్తున్న వైమానిక దళాలకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. వారికి మరో సారి అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. వారి సేవలు యావత్‌ దేశం గర్వపడేలా ఉన్నాయని ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించారు.



595
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles