న‌ల్ల‌త్రాచును ప‌ట్టుకున్న ప్రియాంకా గాంధీ.. వీడియో

Thu,May 2, 2019 12:30 PM

హైద‌రాబాద్: ప్రియాంకా గాంధీ వ‌ద్రాకు విష స‌ర్పాలంటే భ‌యంలేదేమో ! ఈ వీడియో చూస్తే అది మీకే అర్థ‌మ‌వుతుంది. యూపీలోని రాయ్‌బ‌రేలీలో ఇవాళ ప్ర‌చారం కోసం వెళ్లిన ప్రియాంకా వ‌ద్రా.. అక్క‌డ పాములు ప‌ట్టేవాళ్ల‌తో కాసేపు ముచ్చ‌టించింది. ఆ స‌మ‌యంలో బుట్ట‌ల్లో ఉన్న పాములను వాళ్లు ప్రియాంకా ముందు ప్ర‌ద‌ర్శించారు. అయితే ఏమాత్రం భ‌యం లేకుండానే.. ప్రియాంకా చాలా ఈజీగా ఆ పాములను ప‌ట్టుకున్న‌ది. న‌ల్ల‌త్రాచుతో పాటు నాగుపామును కూడా ప్రియాంకా ప‌ట్టుకుని బుట్టులో పెట్టింది. ఈ సంద‌ర్భంగా పాములు ప‌ట్టేవారి స‌మ‌స్య‌ల‌ను ఆమె అడిగి తెలుసుకున్నారు.4016
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles