కాశీ విశ్వ‌నాథ్ ఆల‌యంలో ప్రియాంక గాంధీ పూజ‌లు

Wed,March 20, 2019 02:39 PM

హైద‌రాబాద్: వార‌ణాసిలోని కాశీ విశ్వ‌నాథ్ ఆల‌యంలో ఇవాళ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. గ‌త మూడు రోజుల నుంచి ప్రియాంక గంగా యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌యాగ్‌రాజ్ నుంచి ఆమె బోటులో ప్ర‌యాణిస్తూ.. లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. అయితే ఇవాళ వార‌ణాసి చేరుకున్న ఆమె మొద‌ట ఓ ఘాట్‌లో గంగా న‌దికి హార‌తి స‌మ‌ర్పించారు. ప్ర‌యాగ్‌రాజ్‌లోని మ‌న‌యా ఘాట్ నుంచి వార‌ణాసిలోని అస్సి ఘాట్ వ‌ర‌కు ప్రియాంక టూర్ సాగింది. అంత‌క‌ముందు ఇవాళ త‌న బ్లాగ్‌లో ప్ర‌ధాని మోదీకి ప్రియాంక కౌంట‌ర్ ఇచ్చారు. ప్ర‌జ‌లు మూర్ఖుల‌ని న‌మ్ముతున్న మోదీ ఆ ఆలోచ‌న నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని ఆమె అన్నారు. మోదీ అధికారం దాహాంతో ఉన్నార‌ని.. ఎవ‌రినైనా ఏమైనా చేయ‌గ‌ల‌రన్న ధీమాతో ఆయ‌నున్నార‌న్నారు.


ఈ టూర్‌లో ప్రియాంక పూర్తిగా హిందుత్వ ఎజెండాతో సాగారు. 140 కిలోమీట‌ర్ల గంగా న‌ది ప్ర‌యాణంలో ఆమె ఆ రూట్లో ఉన్న అన్ని ఆల‌యాల‌ను సంద‌ర్శించారు. యూపీలో గంగా ప‌రివాహాక ప్రాంతంలో అనేక పురాణ ఆల‌యాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర మ‌హిళ‌లు కూడా ఎక్కువగా ఆల‌యాల‌కు వ‌స్తుంటారు. దీంతో ప్రియాంకా.. త‌న టూరులో.. ప్ర‌ముఖ ఆల‌యాలు ఉన్న ప్రాంతాల్లో ప్ర‌చారం చేశారు. స్థానిక మ‌హిళ‌ల‌తో క‌నెక్ట్ అయ్యేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేశారు. గ‌త ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రియాంకా సోద‌రుడు రాహుల్ గాంధీ కూడా ఆయా రాష్ట్రాల్లోని ఆల‌యాల‌ను సంద‌ర్శించారు. ఒక ర‌కంగా హిందుత్వ ఎజెండాతో రాహుల్ చేప‌ట్టిన ఆ ప్ర‌య‌త్నాల్లో కొంత మెరుగైన ఫలిత‌మే వ‌చ్చింది. కొన్ని కీల‌క రాష్ట్రాల‌ను తిరిగి కాంగ్రెస్ చేజిక్కించుకున్న‌ది. ఇప్పుడు ప్రియాంకా గాంధీ కూడా హిందుత్వ ఎజెండాతోనే.. గంగా న‌దిలో బోటు ప్ర‌చారం నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది.

872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles