ప్ర‌జాతీర్పును నిర్వీర్యం చేస్తున్నారు: సోనియా గాంధీ

Thu,September 12, 2019 01:51 PM

Public mandate is being misused, says Sonia Gandhi

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ఇవాళ ఆ పార్టీ నేత‌ల‌తో ఢిల్లీలో స‌మావేశం నిర్వ‌హించారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రీ బ‌ల‌హీనంగా ఉంద‌న్నారు. న‌ష్టాల ఊబి పెరుగుతోంద‌న్నారు. కానీ ప్ర‌భుత్వం మాత్రం కేవ‌లం రాజ‌కీయ క‌క్ష్య‌సాధింపుపైనే దృష్టి పెట్టింద‌ని సోనియా అన్నారు. ప్ర‌జాస్వామ్యం పెను ప్ర‌మాదంలో ఉంద‌న్నారు. ప్ర‌జలు ఇచ్చిన అధికారాన్ని ప్ర‌భుత్వం దుర్వినియోగం చేస్తుంద‌న్నారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన రీతిలో ప్ర‌జాతీర్పును నిర్వీర్యం చేస్తున్నార‌ని సోనియా ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. గాంధీ, ప‌టేల్‌, అంబేద్క‌ర్ లాంటి నేత‌ల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు.



898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles