హెల్మెట్ రూల్‌.. గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్‌ బేడీకి వ్య‌తిరేకంగా సీఎం ధ‌ర్నా

Wed,February 13, 2019 02:57 PM

పుదుచ్చ‌రి: హెల్మెట్ రూల్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ జారీ చేసిన ఆదేశాల‌కు వ్య‌తిరేకంగా పుదుచ్చ‌రి సీఎం వీ.నారాయ‌ణ‌స్వామి ఇవాళ రాజ్‌భ‌వ‌న్ ముందు ధ‌ర్నా చేప‌ట్టారు. క్యాబినెట్ మంత్రుల‌తో ఆయ‌న ఆ ధ‌ర్నాలో పాల్గొన్నారు. న‌ల్ల‌దుస్తులు ధ‌రించిన సీఎం నారాయ‌ణ‌స్వామి.. గ‌వ‌ర్న‌ర్‌ను రీకాల్ చేయాలంటూ కేంద్రాన్ని కోరారు. ద్విచ‌క్ర‌వాహ‌నాదారులు హెల్మెట్‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని డీజీపీ ఆదేశించిన‌ నియ‌మావ‌ళిని ద‌శ‌ల‌వారీగా అమ‌లు చేయాల‌ని సీఎం కోరారు. త‌మ నిర‌స‌న‌ను శాంతియుతంగా తెలియ‌జేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ.. సోమ‌వారం త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. రోడ్డుపై హెల్మెట్ లేకుండా వెళ్తున్న టూవీల‌ర్స్‌ను ఆమె ఆపేశారు. హెల్మెట్లు ధ‌రించాలంటూ ఆమె వారికి వార్నింగ్ ఇచ్చారు. అయితే వాహ‌న‌దారుల ప్రాణ ర‌క్ష‌ణ కోసం గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని.. సీఎం నారాయ‌ణ‌స్వామి వ్య‌తిరేకించ‌డం అర్థంకాని వ్య‌వ‌హారంగా మారింది.

2935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles