మ్యూజియంగా చత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్

Thu,February 22, 2018 04:20 PM

ముంబయి: 130 సంవత్సరాల చరిత్ర కలిగిన చత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ రైల్వే స్టేషన్ రైల్వే మ్యూజియంగా మారనుంది. సౌత్ ముంబైలో సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో ఉన్న సీఎస్‌ఎమ్‌టీ బిల్డింగ్‌ను మ్యూజియంగా మార్చేందకు రైల్వేశాఖ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇక్కడి నుంచి రైల్వేస్టేషన్, ప్రధాన కార్యాలయాలనును తరలించడాన్ని రైల్వే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. 2017 నవంబర్‌లో ఈ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన రైల్వేశాఖ మంత్రి పీయుష్‌గోయల్ చత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్‌ను వరల్డ్ క్లాస్ మ్యూజియంగా మారుస్తామని హామి ఇచ్చారు.


దీన్నీ మ్యూజియంగా మర్చేందుకు అధికారులు అడ్వైజరీ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. 2005లో ఈ రైల్వేస్టేషన్ వరల్డ్ హెరిటేజ్‌గా గుర్తింపు పొందింది. 1877లో బ్రిటీష్ ఆర్కిటెక్ ఫెడరిక్ విలియమ్ స్టివెన్స్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ నిర్మాణానికి 10 సంవత్సరాల సమయం పట్టింది. ప్రస్తుతం ఈ రైల్వేస్టేషన్ నుంచి 30 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్నారు.

1301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles