భారీ వ‌ర్షాలు.. 17 విమానాలు దారిమ‌ళ్లింపు

Sat,July 27, 2019 10:43 AM

హైద‌రాబాద్‌: ముంబైలో అతి భారీ వ‌ర్షం కురుస్తున్న‌ది. దీంతో ముంబైకి రావాల్సిన 17 విమానాల‌ను దారి మ‌ళ్లించారు. శుక్ర‌వారం ముంబైలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షం కురిసింది. అయితే స‌మీప విమానాశ్ర‌యాల‌కు విమానాల‌ను దారి మ‌ళ్లించారు. వ‌ర్షాల వ‌ల్ల ఎయిర్‌పోర్ట్ ఆప‌రేష‌న్స్ గంట‌ల కొద్ది ఆల‌స్యంతో కొన‌సాగుతున్నాయి. ఇవాళ కూడా మ‌హారాష్ట్ర‌లో ప‌లుచోట్ల వ‌ర్షం కుర‌వ‌నున్న‌ది. థానే, రాయిగ‌డ్‌, ముంబైలో వ‌ర్షాలు ప‌డ‌నున్నాయి. ఇవాళ ఉద‌యం ముంబై నుంచి బ‌య‌లుదేరాల్సిన 11 విమానాల‌ను ర‌ద్దు చేశారు. బ‌ద్లాపూర్‌లో మ‌హాల‌క్ష్మీ రైలు 700 మంది ప్యాసింజెర్ల‌తో నిలిచిపోయింది. స‌బ‌ర్బ‌న్ స‌ర్వీసులు పాక్షికంగా న‌డుస్తున్నాయి. ముంబై ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి.

722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles