'టీడీపీ' చచ్చిపోయింది: వర్మ

Thu,May 23, 2019 12:21 PM

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ప‌రాజ‌యంపై వివాదాస్ప‌ద‌ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుపై సెటైర్లు వేస్తూ వ‌రుస ట్వీట్లు చేశారు. చంద్రబాబు చేసిన పాపాలు చుట్టుకుని సైకిల్‌ టైర్‌ పంక్చర్‌ అయిందనే సెటైరిక్ మెమ్‌తో ప్రారంభించిన వర్మ.. టీడీపీ పుట్టింది 1982, మార్చి 29 అని.. మ‌ర‌ణించిన తేదీ మాత్రం 2019, మే 23 అని వ్యాఖ్యానించారు. టీడీపీ చావుకు.. అబద్దాలు, వెన్నుపోట్లు, అవినీతి, అసమర్థత, నారా లోకేష్‌, వైఎస్‌ జగన్‌ చరిష్మా కారణమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు తన మామ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు చేసిన మోసం గుర్తుకు వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులకు ఊహించని షాక్‌ తగిలింది. తొలి రౌండ్‌ కౌంటింగ్‌లో మంత్రులు సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, నారాయణలతో పాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వెనుకంజలో ఉన్నారు.

5617
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles