స్పీకర్ ఆఫీస్ లోకి రెబల్ ఎమ్మెల్యే పరుగులు..వీడియో

Thu,July 11, 2019 06:55 PM

Rebel MLA Byrathi Basavaraj runs into the Speaker office


క‌ర్నాట‌క రెబ‌ల్ ఎమ్మెల్యేలు త‌మ రాజీనామాల‌ను అసెంబ్లీ స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించుకోవాల‌ని సుప్రీంకోర్టు నేడు స్ప‌ష్టం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం 6 గంట‌ల‌కు రెబ‌ల్ ఎమ్మెల్యేలు స్పీక‌ర్‌ను క‌లుసుకోవాల‌ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ను కలిసేందుకు అసమ్మతి కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు బెంగళూరులోని విధానసౌధకు చేరుకున్నారు.

రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ సహా మిగతా అసమ్మతి ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ స్పీకర్ ఆఫీసులోకి పరుగులు పెట్టారు. ఆయనతోపాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా హడావుడిగా ఆఫీసులోకి వెళ్లారు.




3161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles