కిక్కెకించిన పోలింగ్ ఆఫీస‌ర్‌.. !

Mon,October 21, 2019 06:21 PM

హైద‌రాబాద్‌: ఓటేసేవాళ్లు.. ఓ నిమిషం స్ట‌న్ అయ్యారు. అందాల పోలింగ్ ఆఫీస‌ర్‌ను చూసి అయోమ‌యానికి లోన‌య్యారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ త‌న చీర క‌ట్టుతో .. ఓట‌ర్ల‌ను థ్రిల్ చేసిన రీనా ద్వివేది.. ఈసారి ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ మ‌ళ్లీ త‌న బ్యూటీ లుక్‌తో ఆక‌ట్టుకున్న‌ది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మొత్తం 11 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే ల‌క్నోలోని కృష్ణాన‌గ‌ర్ పోలింగ్ బూత్‌లో రీనా ఓ మెరుపులా త‌ళుక్కుమ‌న్న‌ది. ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్ లో ప‌నిచేసే ద్వివేది.. ఇవాళ కూడా ఎల‌క్ష‌న్ డ్యూటీకి వ‌చ్చింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ ఎల్లో సారీలో జిగేల్‌మ‌న్న రీనా.. ఈసారి మాత్రం పింక్ సారీలో తెగ అట్రాక్ట్ చేసింది. పోలింగ్ బూత్‌కు వ‌చ్చిన ఓట‌ర్లు .. రీనా స్ట‌యిలిష్ చీర‌క‌ట్టును చూసి బోల్తాప‌డ్డారు. గులాబీ రంగు చీర‌.. బ్లాక్ బ్లౌజ్‌లో గుబులు పుట్టించిన రీనాతో ఓట‌ర్లు ఎగ‌బ‌డి మ‌రీ ఫోటోలు దిగారు. గ‌తంలోనూ ఇంట‌ర్నెట్‌ను షేక్ చేసినా రీనా.. ఈసారి కూడా త‌న బోల్డ్ అప్పీల్‌తో మ‌రోసారి సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. ఓట‌ర్లు త‌మ మొబైల్ ఫ్లోన్ల‌కు ప‌నిపెడుతుంటే.. పోలింగ్ ఆఫీస‌ర్ రీనా న‌వ్వుతూ వారికి ఫోజులిచ్చింది. ఇటీవ‌ల టిక్‌టాక్‌లోనూ రీనా త‌న స్కిల్స్ ప్ర‌ద‌ర్శించింది. ఆమె చేసిన డ్యాన్స్ ఆ యాప్‌ ల‌వ‌ర్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది.


13495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles