కుంభ‌మేళా@4200 కోట్లు

Wed,January 16, 2019 01:10 PM

Rs 4200 crore allocated for this years Kumbh Mela

ప్ర‌యాగ్‌రాజ్: త్రివేణీ సంగ‌మ న‌గ‌రం అల‌హాబాద్ అలియాస్ ప్ర‌యాగ్‌రాజ్‌లో కుంభ‌మేళా ఘ‌నంగా మొద‌లైంది. అయితే ఆ మ‌హావేడుక కోసం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 4200 కోట్లు కేటాయించింది. ఇది 2013లో జ‌రిగిన మ‌హాకుంభ‌మేళా క‌న్నా మూడు రేట్లు ఎక్కువ బ‌డ్జెట్‌. దీంతో ప్ర‌స్తుతం కుంభ‌మేళా.. అత్యంత ఖ‌రీదైన ఆధ్యాత్మిక ఘ‌ట‌న‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది జ‌రుగుతున్న కుంభ‌మేళాకు 4200 కోట్లు కేటాయించిన‌ట్లు ఆర్థిక మంత్రి రాజేశ్ అగ‌ర్వాల్ తెలిపారు. కుంభేమేళా ప్రాంతాన్ని రెండింత‌లు విస్త‌రించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మొత్తం 3200 హెక్టార్ల మేర‌కు కుంభ‌మేళాను విస్త‌రించి ఏర్పాట్లు చేశారు. సుమారు 48 రోజుల పాటు సాగే ప‌విత్ర వేడుక కోసం ప్ర‌జ‌లు భారీ ఎత్తున వ‌స్తున్నారు. జ‌న‌వ‌రి 21 (పౌష పూర్ణిమ‌), ఫిబ్ర‌వ‌రి 4 (మౌని అమావాస్య), ఫిబ్ర‌వ‌రి 10(వ‌సంత పంచ‌మి), ఫిబ్ర‌వ‌రి 19(మాగి పూర్ణిమ), మార్చి 4(మ‌హాశివ‌రాత్రి)న‌ ప‌విత్ర స్నానాలు ఆచ‌రించ‌నున్నారు.

1796
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles