రూ. 50 వేల కరెన్సీ నోట్లను ఎలుకలు కొరికాయి..

Mon,October 21, 2019 09:52 PM

చెన్నై : కరెన్సీ నోట్లను ఎలుకలు కొరికేశాయి. ఈ ఘటన తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలోని వెల్లియన్‌గాడు గ్రామంలో చోటు చేసుకుంది. రంగరాజ్ అనే రైతు తన పంటను అమ్మగా వచ్చిన రూ. 50 వేల నగదును ఇంట్లో దాచిపెట్టాడు. అయితే ఆ నగదును ఎలుకలు కొరికేశాయి. కరెన్సీ నోట్లను ముక్కలు ముక్కలుగా చేశాయి ఎలుకలు. ఎలుకలు కొరికిన నోట్లను మార్పిడి చేసేందుకు బ్యాంక్‌కు తీసుకెళ్లగా.. అధికారులు వాటిని తిరస్కరించారని రైతు రంగరాజు తెలిపారు. ధాన్యం అమ్మగా వచ్చిన ఆదాయం ఎలుకల పాలు అవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు.



1940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles