లూధియానాలో రూ. 75 లక్షల నగదు సీజ్

Tue,January 31, 2017 07:33 AM

పంజాబ్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన బందోబస్తులో పోలీసులు రూ.75 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని లూధియానాలో నిన్న చోటుచేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాల తనిఖీని చేపట్టగా పోలీసులు ఈ నగదును గుర్తించి సీజ్ చేశారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ శాసనసభకు ఫిబ్రవరి 4వ తేదీన పోలింగ్ జరగనుంది. మార్చి 11న కౌంటింగ్‌ను చేపట్టనున్నారు. శిరోమణి అకాళిదళ్-బీజేపీ నేతృత్వంలో ప్రకాశ్‌సింగ్ ఆధ్వర్యంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగుతుంది. శిరోమణి అకాళిదళ్-బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్‌వాది పార్టీలు ప్రధాన పోటీదారులుగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles