మ‌రీ క‌నిష్టం.. ప‌డిపోయిన రూపాయి విలువ‌

Mon,August 26, 2019 12:51 PM

హైద‌రాబాద్‌: అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మార‌కం విలువ ఇవాళ ప‌డిపోయింది. డాల‌ర్‌తో రూపాయి విలువ ఇవాళ ట్రేడింగ్ స‌మ‌యంలో 72.03గా ఉంది. అయితే ట్రేడింగ్‌లో రూపాయి విలువ 58 పైస‌లు కోల్పోయింది. దీంతో రూపాయి విలువ డాల‌ర్‌తో పోలిస్తే 72.24గా నిలిచింది. ఇంకా ఇవాళ మార్కెట్‌లో ట్రేడింగ్ జ‌రుగుతోంది. అయితే రూపాయి విలువ మ‌రింత ప‌త‌నం అవుతుందా లేక మ‌ళ్లీ పుంజుకుంటుందా అన్న ఆస‌క్తి మార్కెట్ వ‌ర్గాల్లో ఉన్న‌ది. ఈ ఏడాదిలో రూపాయి క‌నిష్టానికి చేర‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. చైనాకు చెందిన యెన్ క‌రెన్సీ ప‌తనం కావ‌డంతో ఆ ప్ర‌కంప‌న‌లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను కుదిపేస్తున్నాయి. 11 ఏళ్ల త‌ర్వాత చైనా క‌రెన్సీ డాల‌ర్ మార‌కంతో పోలిస్తే క‌నిష్టానికి ప‌డిపోయింది. 2008లో చివ‌రిసారి చైనా క‌రెన్సీ విలువ ప‌త‌న‌మైంది. ఇవాళ చైనా మార్కెట్లో అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే యెన్ విలువ 7.1468గా ఉంది. అయితే ప్ర‌స్తుం ఇంధ‌న ధ‌ర‌లు మార్కెట్లు త‌క్కువ‌గా ఉన్న కార‌ణంగా.. అది కాస్త రూపాయి బ‌లోపేతానికి క‌లిసి వ‌చ్చిన‌ట్లు అయ్యింది. మ‌రోవైపు చైనా, అమెరికా మ‌ధ్య ఉన్న వాణిజ్య యుద్ధం వ‌ల్ల బంగారం ధ‌ర‌లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.

1415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles