ఆ ఇద్ద‌రికీ భ‌ద్ర‌త‌నివ్వండి : సుప్రీం ఆదేశం

Fri,January 18, 2019 01:05 PM

Sabarimala controversy : SC asks kerala to provide security for two women

న్యూఢిల్లీ: శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామిని ద‌ర్శించుకున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు 24 గంట‌లూ భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు త‌న తీర్పులో ఆదేశించింది. కొన్ని రోజుల క్రితం క‌న‌క‌దుర్గ‌, బిందు అనే ఇద్ద‌రు మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్నారు. దీంతో అయ్య‌ప్ప స‌మితి ఆందోళ‌న‌కారులు వారిపై దాడి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వాళ్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని సుప్రీంలో ఓ పిటిష‌న్ వేశారు. దానిపై స్పందించిన కోర్టు.. ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు రౌండ్ ద క్లాక్ సెక్యూర్టీ క‌ల్పించాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. కేర‌ళ ప్ర‌భుత్వ‌మే ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు పూర్తి ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ స్ప‌ష్టం చేశారు. 50 ఏళ్ల లోపు వ‌య‌సు ఉన్న‌ మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లి అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకోవ‌చ్చు అని ఇటీవ‌ల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన త‌ర్వాత ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లు అక్క‌డ‌కు వెళ్లారు. జ‌న‌వ‌రి 2వ తేదీన కేర‌ళ‌కు చెందిన ఆ ఇద్ద‌రూ స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.

1995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles