ప్రధాని మోదీపై బీఎస్ఎఫ్ జవాన్ పోటీ

Mon,April 29, 2019 04:17 PM

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీపై సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ పోటీ చేయనున్నారు. వారణాసి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా అతడిని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) బరిలో దించింది. ఇంతకుముందే పార్టీ తరఫున ఎస్పీ అభ్యర్థిగా శాలినీ యాదవ్‌ను ప్రకటించిన ఎస్పీ తాజాగా అమె స్థానంలో జవాన్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమిలో భాగంగా ఈ స్థానాన్ని ఎస్పీకి కేటాయించారు. కూటమి అభ్యర్థిగా వ్యూహాత్మకంగా మాజీ జవాన్ తేజ్ బహదూర్‌ను పోటీకి నిలిపారు.


కొందరు సీనియర్ బీఎస్ఎఫ్ అధికారులు అక్రమాలకు పాల్పడుతూ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లకు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని 2017 జనవరిలో ఫేస్‌బుక్ లో వీడియోను పోస్టు చేసిన విష‌యం తెలిసిందే. నిబంధనలకు విరుద్దంగా ఫిర్యాదు చేసిన అతన్ని ఉద్యోగం నుంచి బీఎస్‌ఎఫ్ తొలగించింది. ఐతే, వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీని పోటీకి నిలుపుతారని ఎస్పీ-బీఎస్పీ కూటమి భావించింది. ఆమె ఇక్కడ పోటీ చేయట్లేదని స్పష్టమవడంతో తమ ఎంపీ అభ్యర్థిని తాజాగా ఎస్పీ మార్చింది. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా 2014లో పోటీ చేసిన అజయ్ రాయ్ కూడా ఈసారి మోదీపై మళ్లీ పోటీ చేస్తున్నారు.

1982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles