ఎగ్స్ కేజ్రివాల్.. ఇదో డిష్ పేరు.. ట్విట్టర్‌లో వైరల్.. ఎందుకంటే?

Wed,March 13, 2019 05:51 PM

ఎగ్స్ కేజ్రివాల్.. అనే డిష్‌ను టేస్ట్ చేశారా ఎప్పుడైనా? పోనీ దాని పేరు విన్నారా? అది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ డిష్. కానీ.. చాలామందికి ఆ డిష్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆ డిష్ గురించే సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్‌లో అయితే.. ఎగ్స్ కేజ్రివాల్ డిష్‌ను పక్కన పెట్టి.. ఆ పేరులో ఉన్న కేజ్రివాల్ మీద పడ్డారు నెటిజన్లు. అసలు ఈ ఎగ్స్ కేజ్రివాల్ కథేంటో తెలుసుకుందాం పదండి.


చెఫ్ సంజీవ్ కపూర్ తెలుసు కదా. ఆయన ఇటీవల ఓ వెరైటీ డిష్ తయారు చేశారు. ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఇంతకీ ఆ వెరైటీ డిష్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అది మరేదో కాదు.. ఎగ్స్ కేజ్రివాల్. దాన్ని ఎలా తయారు చేయాలో ఆ వీడియోలో చూపించారు చెఫ్. దాన్ని బ్రెడ్, బట్టర్, చీజ్, ఎగ్‌తో తయారు చేస్తారు. దాన్ని ఎలా తయారు చేస్తారు.. అనేది పక్కన పెడితే.. దాని పేరును చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అసలు దీనికి కేజ్రివాల్ అనే పేరు ఎందుకు పెట్టారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కేజ్రివాల్ అంటే ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కాదు కదా.. ఒకవేళ ఆయన పేరు మీదనే ఈ డిష్ వస్తే మాత్రం ఆయన ఆ డిష్‌కు పేరు పెట్టిన వాళ్లపై కేసు వేయొచ్చు.. అంటూ రకరకాలుగా ఫన్నీ కామెంట్లు పెడుతూ.. ఆ పోస్టును వైరల్ చేస్తున్నారు. అందులో ఫన్నీగా ఉన్న కొన్ని ట్వీట్లను మీరే చదవండి.











1346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles