జ‌మ్మూక‌శ్మీర్‌లో నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం

Mon,August 19, 2019 09:56 AM

Schools colleges and government offices to reopen in Jammu and Kashmir on Monday

హైదరాబాద్ : జ‌మ్మూక‌శ్మీర్‌లో నేటి నుంచి స్కూళ్లు, ప్ర‌భుత్వ ఆఫీసులు తెరుచుకోనున్నాయి. గ‌త రెండు వారాల నుంచి క‌శ్మీర్‌లో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. క‌శ్మీర్‌లో విధించిన ఆంక్ష‌ల‌ను దశలవారీగా ఎత్తేస్తున్నారు. కశ్మీర్ వ్యాలీలో కూడా పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులను ఇవాళ్టి నుంచి ప్రారంభించనున్నారు. శ్రీనగర్ లో 190 స్కూళ్లను ఇవాళ తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు. మిగతా ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలను దశలవారీగా తెరవనున్నారు.

శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో అధికారులు ఆదివారం మళ్లీ ఆంక్షలు విధించారు. శనివారం జరిగిన హింసాత్మక ఘటనలు, హజ్ యాత్రికులు ఆదివారం శ్రీనగర్‌కు చేరుకున్న నేపథ్యంలో అధికారులు ఈ ఆంక్షలను విధించారు. శ్రీనగర్‌లోని డజనుకు పైగా ప్రాంతాల్లో నిరసనకారులు శనివారం ఆందోళనలు చేపట్టారని, ఈ ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం శ్రీనగర్ విమానాశ్రయానికి 300 మందికిపైగా హజ్ యాత్రికులు చేరుకున్నారని, వాళ్ళను గమ్యస్థానాలకు చేరవేసే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్టు తెలిపారు.

కశ్మీర్ లోయలో ఆదివారం కూడా ఆంక్షలు కొనసాగాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, జమ్ములోని ఐదు జిల్లాల్లో 2జీ మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని అధికారులు నిలిపివేశారు. సోషల్‌మీడియాలో తప్పుడు సందేశాలు, వీడియోలతో దుష్ర్పచారం జరుగుతుందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తప్పుడు ప్రచారం నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

460
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles