భారీ వర్షాలతో రేపు స్కూల్స్‌కు సెలవు..

Tue,August 29, 2017 06:52 PM


ముంబై: ముంబై నగరంలో భారీ వర్షాల ధాటికి రహదారులపై ఎక్కడికక్కడ వరద నీరు చేరుకుంటుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నగర వాసులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రేపు ముంబైలోని స్కూళ్లు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తాడ్వే తెలిపారు. గత 48 గంటలుగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు రైళ్ల రాకపోకలు, వాహన రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచపోయాయి. ముంబై మీదుగా వెళ్లే పలు విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. మరోవైపు వరద సహాయక బృందం, డైవింగ్ టీమ్స్ రంగంలోకి సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
rains-divingteams
Diving-teams

3765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles