హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌

Mon,October 14, 2019 12:37 PM

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌ పోలీసులు, నిఘా వర్గాలు కలిసి సోమవారం ఉదయం ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. కశ్మీర్‌లోని గందర్బాల్‌లో ఉగ్రవాదులు తల దాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడ ఆపరేషన్‌ నిర్వహించి ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles