ప్రొటెం స్పీకర్‌గా సంతోష్ కుమార్ గంగ్వార్?

Fri,May 24, 2019 05:07 PM

Senior BJP leader Santosh Gangwar will be the pro tem speaker

హైదరాబాద్ : లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ కుమార్ గంగ్వార్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో గంగ్వారే సీనియర్ నాయకుడు కాబట్టి ఆయననే ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. సంతోష్ గంగ్వార్ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నియోజకవర్గం నుంచి వరుసగా 8 సార్లు పార్లమెంట్‌కు ఎంపికయ్యారు. ఒక వేళ ప్రొటెం స్పీకర్‌గా సంతోష్ గంగ్వార్‌ను ఎన్నుకుంటే.. తాజాగా లోక్‌సభకు ఎంపికైన ఎంపీల చేత ఆయనే ప్రమాణస్వీకారం చేయించనున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్‌గా ఈయనే కొనసాగనున్నారు. 1989 నుంచి 2019 ఎన్నికల వరకు బరేలీ నియోజకవర్గం నుంచే గంగ్వార్ పోటీ చేసి గెలుపొందారు. కానీ 2009 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. 14వ లోక్‌సభలో సంతోష్ గంగ్వార్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా కూడా సేవలందించారు.

2577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles