స్టాక్‌మార్కెట్ల హవా.. సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు

Wed,October 25, 2017 12:15 PM

ముంబై: స్టాక్‌మార్కెట్లు ట్రేడింగ్‌లో దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీలు ఇవాళ కొత్త రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్ అత్యధికంగా 33,117.33 పాయింట్లకు చేరుకున్నది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా చరిత్రాత్మకంగా 10,340.5 పాయింట్లను తాకింది. పబ్లిక్ రంగ బ్యాంకులకు 2.11 లక్షల కోట్లు ప్యాకేజీని కేంద్రం ప్రకటించడంతో ఇవాళ స్టాక్‌మార్కెట్లు దడదడలాడించాయి. సెన్సెక్స్ ఇవాళ 509.99 పాయింట్ల పురోగతి నమోదు చేసింది. ఈనెల 17వ తేదీన నమోదు చేసిన 32,699 పాయింట్ల ట్రేడింగ్ రికార్డును అధిగమించింది. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ షేర్లు ఇవాళ 19.47 శాతం పెరిగాయి. ప్రైవేటు బ్యాంక్‌లు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు దాదాపు 8 శాతం ప్రగతిని నమోదు చేశాయి. దీంతో స్టాక్‌మార్కెట్లు ట్రేడింగ్‌లో కొత్త రికార్డులను అందుకున్నాయి. నిఫ్టీ ఇవాళ సుమారు 132.85 పాయింట్ల లాభం నమోదు చేసింది. ఈనెల 17న నమోదు అయిన రికార్డును నిఫ్టీ కూడా అధిగమించింది. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. బ్యాంకులకు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడంతో స్టాక్‌మార్కెట్లు జోరును ప్రదర్శించినట్లు నిపుణులు అంటున్నారు.

1468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles