అమర జవాన్‌ కుటుంబాన్ని దత్తత తీసుకుంటా : కలెక్టర్‌

Mon,February 18, 2019 03:43 PM

Sheikhpura collector Inayat Khan to adopt family of CRPF martyr

పాట్నా : పుల్వామా ఉగ్రదాడిలో బీహార్‌కు చెందిన ఇద్దరు జవాన్లు సంజయ్‌ కుమార్‌ సిన్హా, రతన్‌ కుమార్‌ ఠాకూర్‌ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని షేక్‌పురా జిల్లా కలెక్టర్‌ ఇనాయత్‌ ఖాన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. తమ జిల్లాలో ఒక అకౌంట్‌ ఓపెన్‌ చేసి విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. మార్చి 10వ తేదీ వరకు విరాళాలను సేకరించి.. వచ్చిన డబ్బును రెండు భాగాలుగా చేసి అమర జవాన్ల కుటుంబాలకు అందజేస్తామని చెప్పారు. ఈ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని దత్తత తీసుకొని వారికి అండగా ఉంటానని కలెక్టర్‌ పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో మొత్తం 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అమర జవాన్ల కుటుంబాలకు పలు రాజకీయ పార్టీల నాయకులు, సెలబ్రెటీలు, ప్రజలు తమకు తోచినంతగా ఆర్థిక సాయం చేస్తున్నారు.

3394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles