
బాలీవుడ్ నటి, సింగర్, హోస్ట్ షిబాని దండేకర్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నది. తను ప్రస్తుతం 'ది స్టేజ్' అనే మ్యూజిక్ టాలెంట్ హంట్ షోకు హోస్ట్‌గా పనిచేస్తోంది. ఆ షోకు సంబంధించిన బ్లూపర్స్ వీడియో అది. తను హోస్ట్ చేసే సమయంలో తడబడుతూ మాట్లాడుతూ.. రిపీట్ చేస్తూ మళ్లీ తను చెప్పాల్సిన విషయాన్ని మరిచిపోతూ ఇలా సరదాగా ఉంటుంది ఆ వీడియో. దాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన షిబాని.. 'నేను జాబ్ బాగా చేస్తాను. ప్లీజ్ నాకు ఉద్యోగం ఇవ్వండి. ఏదైనా సమాచారం కావాలంటే నా మేనేజర్‌ను కాంటాక్ట్ చేయండి..' అంటూ ఆ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో షేర్ అయిన క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. నెటిజన్లు కూడా ఆ వీడియోపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. షిబాని.. ది స్టేజ్ అనే టీవీ షోకు హోస్ట్‌గా పనిచేయడంతో పాటు.. స్టయిల్, ది సిటీ, టాప్ మోడల్ ఇండియా అనే షోలకు కూడా హోస్ట్‌గా పనిచేస్తోంది. బాలీవుడ్‌లోనూ షిబాని నటించింది. రాయ్, షాన్‌దార్ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వస్తున్న బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్‌లో నటిస్తోంది.